కాజల్‌ దెబ్బకు.. కేథరిన్ ఔట్‌..!

Catherine out in ravitheja bogas film

కేథరిన్ …అందానికి మారుపేరు ఈ మ‌ళ‌యాళీ కుట్టి. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. రుద్ర‌మ‌దేవి.. స‌రైనోడు సినిమాల్లో న‌టించిన కేథ‌రిన్ త‌న అంద‌చందాల‌తో అభిమానుల మ‌న‌స్సు కొల్ల‌గొట్టింది. ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు.

తెలుగులో క్రేజ్ పరంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తోంది. అయితే ఈ మధ్య ఆఫర్ల వచ్చినట్టే వచ్చి.. చేజారిపోతుండటం అమ్మడిని కలవరపాటుకు గురిచేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

   Catherine out in  ravitheja bogas film

తమిళంలో హిట్ కొట్టిన ‘బోగన్’ సినిమాను రవితేజతో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి కేథరిన్ ను తప్పించారట.

Catherine out in  ravitheja bogas film

కారణమేంటనేది తెలియదుగానీ .. ఆ ప్లేస్ లో కాజల్ ను తీసుకున్నారని సమాచారం. అయితే గతంలో రవితేజ – కాజల్ కాంబినేషన్లో వచ్చిన ‘వీర’ .. ‘సారొచ్చారు’ ఆడియాన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయినా ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటం విశేషం. మొత్తానికి వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్, కేథరిన్‌ కు పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి.