కేథరిన్ అందాల ఆరబోత..

katherine tresa

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కేథరిన్ సినిమాలు చేస్తూ వస్తోంది. గ్లామర్ పరంగా ఈ సుందరికి ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి గానీ, నటన విషయంలో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతోంది. దాంతో రెండవ కథానాయికగానే అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయి  గ్లామర్ డోస్ పెంచేయడమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ కి ప్రాధాన్యతనిస్తోంది. ఆమె చేస్తోన్న స్పెషల్ సాంగ్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.కేథరిన్‌  ఆశించిన విజయం మాత్రం గత ఏడాది ‘సరైనోడు’తో దక్కింది.

katherine tresa

ఈ మధ్యే కేథరిన్ ‘గౌతమ్ నంద’తో పలకరించింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ కేథరిన్ గ్లామర్ ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు  రేపు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా కేథరిన్‌ వయ్యారాన్ని ఒలకబోసిందట. ఈ సినిమాల్లో ఈ భామ ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోందని తెలుస్తోంది.

katherine tresa

రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో లీడ్ హీరోయిన్ కాజలే అయినప్పటికీ కేథరిన్ కూడా కీలక పాత్రే చేసిందట. ట్రైలర్లో సిగరెట్ తాగుతూ కనిపించిన కేథరిన్ తన పాత్రపై ఆసక్తి రేకెత్తించింది. కాజల్ కొంచెం పద్ధతిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇందులో గ్లామర్ పార్ట్ అంతా కేథరిన్ చూసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కేథరిన్ నటించిన మరో సినిమా ‘జయ జానకి నాయక’. ఈ సినిమాలో   రకుల్ ప్రీత్ ప్రధాన కథానాయికగా నటించగా.. ప్రగ్యా, కేథరిన్ అందాల ప్రదర్శనలో పోటీ పడనున్నారు. కేథరిన్ కనిపించే పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న కేథరిన్‌కు ఈ సినిమాలు  ఏమేరకు హిట్ నిస్తాయో చూడాలి.