చైతూ.. సమంతల పెళ్లి కార్డు ఇదే…

Chaitanya, Samantha Wedding Card

టాలీవుడ్ ప్రముఖులే కాకుండా సామాన్యులు కూడా ఎదురు చూస్తున్న అక్కినేని పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది.   క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ వివాహ వేడుక గోవా వగటర్ బీచ్ సమీపాన ఉన్న W హోటల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

Chaitanya, Samantha Wedding Card

ఇక పెళ్లి వేడుకకు ఎక్కువ మంది కాకుండా అతి కొద్దీ మందిని మాత్రమే పిలుస్తారని సమాచారం. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు పూర్తిస్థాయిలో సినీ-రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు.ఈ కార్డులు మాత్రం నాగార్జున, అమల స్వయంగా ఆహ్వనితులకు ఇవ్వడానికి వెళ్తున్నట్టు టాక్. జనవరిలో చైతూ, సామ్‌ నిశ్చితార్థం వేడుక కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’లో నటిస్తున్నారు. దీంతోపాటు ఆమె ‘సావిత్రి’, విజయ్‌ 61వ చిత్రంలో నటిస్తున్నారు. చైతూ ‘యుద్ధం శరణం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత నుంచి షూటింగ్‌కు హాజరుకానున్నట్లు సమంత ఇటీవల పేర్కొన్నారు.  రామ్ చరణ్-సుకుమార్ రంగస్థలం షూటింగ్ కీలక దశలో ఉంది కాబట్టి ఎటువంటి గ్యాప్ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుందట. చైతు కూడా ఆ టైం పూర్తి చేయాల్సిన కమిట్మెంట్స్ ఉండటం తో తన నిర్ణయాన్ని సమర్దించినట్టు తెలిసింది.