బుజ్జి కేటీఆర్‌కు రామన్న ఫిదా..

Child dresses as KTR and goes to school

హైదరాబాద్‌లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు కృష్ణుడు, ఏసుక్రీస్తు, శాంతాక్లాజ్, వివేకానందుడు వంటి వేషాలు వేసి  సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కొంతమంది రాజ‌కీయ నాయ‌కుల వేషాలు కూడా వేసి అచ్చం వారిలా న‌టిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక ఈ ప్రొగ్రాంలో బుజ్జి కేటీఆర్‌ ప్రత్యక్షమయ్యారు. నగరానికి చెందిన రెండేళ్ల బాలిక ఆయిరాను తల్లిదండ్రులు కేటీఆర్‌ వేషధారణలో ఆమె పాఠశాలలో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలకు పంపించారు. కేటీఆర్‌ తరహాలో ప్యాంట్‌, చొక్కా, క్రాప్‌తో పాటు కేటీఆర్‌ పేరు గల బ్యాడ్జీని తగిలించారు.

భుజంపై టీఆర్ఎస్‌ కండువాను వేశారు. ఆ ఫోటోలను వారు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పంపించారు. అది చూసి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. ఆయిరా తల్లిదండ్రులు పంపిన ఫోటోలు తన మనసును హత్తుకున్నాయని, కృతజ్ఞతలు అని ట్విట్టర్‌లో తెలిపారు.