మెగాస్టార్‌ మాటల్లో మహానటి..

Chiranjeevi Talking about Mahanati

సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తను కదలకుండా కథను నడిపించగలిగే మహానటి సావిత్రి అని ఆయన కొనియాడారు.

Chiranjeevi Talking about Mahanati

చిరంజీవి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులున్నా సావిత్రి మాత్రమే మహానటి అని పేర్కొన్న చిరంజీవి.. ఆమెతో కలిసి నటించే అదృష్టం కెరీర్ తొలినాళ్లలోనే దక్కినందుకు గర్వంగా ఉందన్నారు. కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన గొప్ప నటి సావిత్రి అని కొనియాడారు. తాను కదలకుండా కథను నడిపించగలిగే గొప్ప నటి అన్నారు. నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తిప్రదాతగా సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారన్నారు.

అలనాటి మహానటి మీద సినిమా తీసి నేటి తరాలకు ఆమె గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

https://www.facebook.com/MahanatiTheFilm/videos/1461903523919910/