యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘సైరా’ షురు..

Chiru Sye Raa updates

చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి  నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.  డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా షూటింగును ప్రారంభించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

సెట్స్ మీదకు రావడమే.. ప్రారంభంలోనే ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ తోనే ప్రారంభించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు… ఓపెనింగ్ షెడ్యూల్ లో కంపోజ్ చేయాల్సిన యాక్షన్ సీన్లను రూపొందించడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

మెగాస్టార్ చాలా ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంలో వేర్వేరు భాషల చిత్ర పరిశ్రమల నుంచి అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి.. కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే ఇప్పటికి ఒక హీరోయిన్ గా నయనతార ఫైనలైజ్ కాగా మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలుసాగుతున్నాయి. ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో నటిస్తోంది.