‘సైరా’ కోసం చిరు న్యూ లుక్‌..

Chiru's New Look in 151st film!

150 సినిమాల్లో నటించిన మెగాస్టార్ చీరంజీవి ఏనాడు కనిపించిన స్టైల్ లోనే మళ్లీ కనిపించలేదు ఆరు పదుల వయసొచ్చినా కూడా మెగాస్టార్ అందంలో కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెగాస్టార్ నటనలో మార్పులు చేసినట్లే తన నడకలో లుక్ లో కొత్తగా కనిపించారే గాని నెగిటివ్ గా ఎప్పుడు కనిపించలేదు. బయట ప్రపంచంలో కూడా ఆయన సింపుల్ గా కనిపించినా అందరు పాజిటివ్ కామెంట్స్ చేశారు.

కానీ ఇప్పుడు మెగాస్టార్ తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం మొన్నటి వరకు గడ్డం, మీసాలతో చిరంజీవి కనిపించారు. అయితే, ఆ ‘లుక్’ నుంచి చిరంజీవి తాజాగా ‘న్యూ లుక్’లోకి వచ్చారు. ఇన్నాళ్లూ గడ్డం, మీసాలతో ఉన్న ‘చిరు’ అందుకు భిన్నంగా క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చారు. నూతన తారాగణంతో రూపొందుతున్న ‘జువ్వ’ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.

Chiru's New Look in 151st film!

ఈ సందర్భంగా ‘న్యూలుక్’లో ఉన్న చిరంజీవిని చూసేందుకు అభిమానులు మరింత ఆసక్తి చూపారు. కాగా, న్యూ ఇయర్ వేడుకల సమయంలో గడ్డం లేకుండా కనిపించిన చిరంజీవి, ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్స్ నిమిత్తం మీసం కూడా తీసేశారని సమాచారం. ‘సైరా నరసింహారెడ్డి’ రెండో షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈలోగా గ్రాఫిక్స్ కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం మెగాస్టార్ న్యూలుక్ లోకి మారారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.