గేల్‌ ఛాలెంజ్‌:ఇంప్రెస్ చేస్తే.. 5వేల డాలర్లు !

Chris Gayle dance challenge to fans
Chris Gayle dance challenge to fans

క్రిస్ గేల్‌.. గ్రౌండ్‌లో ఎంత కూల్‌గా సిక్స్‌లు బాదేస్తూ.. ఆటను ఎంతగా ఎంజాయ్ చేస్తాడో.. అలాగే పార్టీలు బాగానే ఎంజాయ్ చేస్తాడో తెలిసిందే.. ఐపీఎల్‌ టూర్‌లో బాగంగా ఎన్నో పార్టీల్లో పాల్గోన్న గేల్‌.. తన డాన్సులతో అటు క్రికెటర్లను.. ఇటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.. ఇప్పుడు క్రిస్ గేల్ అభిమానుల‌కు ఓ చాలెంజ్ విసిరాడు. ర‌యీస్ మూవీలోని లైలా మై లైలా పాట‌కు స్టెప్పులేసిన గేల్.. ఇదే పాట‌కు త‌న‌ను ఇంప్రెస్ చేసే స్టెప్పులేసిన వారికి 5 వేల డాల‌ర్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. శ‌నివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన గేల్‌.. ఈ చాలెంజ్ విసిరాడు. లేడీస్ ఈ ఛాలెంజ్‌ మీరు కూడా పాల్గోనచ్చు.. త‌న‌కు వ‌చ్చిన వీడియోలలో బెస్ట్ 5ని త‌న పేజ్‌లో షేర్ చేస్తాన‌ని, అందులో బెస్ట్ వీడియోకు అభిమానులే ఓటేయాల‌ని కోరాడు. త‌ను కూడా ఈ పాట‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఆ వీడియో చూడండి.