రోడ్డు ప్రమాదంలో పదిమంది మృతి..సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

CM KCR

గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, కంటెయినర్, లారీ, క్వాలిస్ వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. లారీ, కంటెయినర్ మధ్య క్వాలిస్ వాహనం చిక్కుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

CM KCR

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, వైద్యసిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ రోడ్డు ప్రమాద ఘటన పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రమాద ఘటనపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.