జలవిహార్‌లో సీఎం బర్త్‌డే వేడుకలు..

CM KCR’s birthday celebrations to be held at Jala Vihar..

ఈ నెల 17న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ కటింగ్‌తోపాటు మెగా రక్తదానశిబిరం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతికర్రలు, వృద్ధ మహిళలకు చీరెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్నిమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు.

CM KCR’s birthday celebrations to be held at Jala Vihar..

రోజంతా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించిన తలసాని , నగరంలోని అన్నిడివిజన్లలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపాలని కార్పొరేటర్లు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నేడు జలవిహార్‌ను సందర్శించి మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

కాగా.. సీఎం కేసీఆర్ 64వ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా రక్తదాన, కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.