అసెంబ్లీ ఎగ్గొట్టి అమ్మాయిలతో డాన్స్‌ చేసిన ఎమ్మెల్యే..

Congress MLA Ambarish skips Assembly, Dances with girls!

సీనియర్ నటుడు కర్ణాటక అధికారపార్టీ ఎమ్మెల్యే అంబరీష్ తాజాగా ఒక వివాదంలో ఇరుక్కుపోయారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టి.. అమ్మాయిలతో జల్సా చేశారు. బెంగళూరులోని ఓ పబ్‌లో ఉత్సాహంగా గెంతులేశారు. యువతులతో కలిసి స్టెప్‌లు వేశారు. అంబరీష్ ఆరోగ్యం బాగోలేదంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో అంబరీష్ అమ్మాయిలతో కనిపించడం సంచలనంగా మారింది.

Congress MLA Ambarish skips Assembly, Dances with girls!

గడిచిన కొద్దిరోజులుగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. డీఎస్పీ గణపతి సూసైడ్ కేసు అసెంబ్లీలో వాద ప్రతివాదాలకు దారి తీసింది. అధికారపక్షం తీరును విపక్షాలు ఎండగడుతున్నాయి. ఇలాంటి వేళ.. సభలో అధికారపక్షానికి అండగా ఉండాల్సిన అంబరీష.. అందుకు భిన్నంగా డ్యాన్సులు వేసిన వైనం విమర్శల పాలయ్యేలా చేసింది. దీనిపై సీఎం సిద్ధ రామయ్యను వివరణ కోరగా ఆయన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

అంబరీష్ మ్యూజిక్ ఈవెంట్లో పాల్గొని డ్యాన్సులు వేయటం.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల్ని లేవనెత్తాల్సింది పోయి అందుకు భిన్నంగా డ్యాన్సులు వేస్తున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఇలా డ్యాన్సుల్లో బిజీగా ఉంటారా అంటూ అంబరీష్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.