కోమటిరెడ్డి,సంపత్.. శాసన సభ్యత్వం రద్దు

Congress MLAs suspended from assembly

మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై దాడిని ఖండించారు స్పీకర్ మధుసుదనాచారి. కాంగ్రెస్ సభ్యుల దాడి దుర్మర్గమని పేర్కొన్నారు. శాసనసభను అగౌరవ పరిచేలా వ్యవహరించిన కాంగ్రెస్ సభ్యులపై సస్పెండ్ చేయాలని హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టగా స్పీకర్ అమోదించారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు.

సస్పెండైన వారిలో జానారెడ్డి,జీవన్ రెడ్డి,గీతా రెడ్డి,చిన్నారెడ్డి,రామ్మోహన్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,డీకే అరుణ,పద్మావతి,మల్లు భట్టి విక్రమార్కలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్ణకరమని..తెలంగాణ శాసనసభను అవమానపరిచేలా కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించారని స్పీకర్ మధుసుదనాచారి తెలిపారు.

komatireddy sampath

సభలో కాంగ్రెస్ సభ్యుల తీరు చాలా బాధాకరమని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలకు ఇది పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ కఠినమైనదైన తప్పదని తెలిపారు.ప్రజలు తెలంగాణ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టికరిపించారని తెలిపారు. అటు శాసనమండలి నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు.