జిమ్మిక్కి క‌మ్మ‌ల్‌కి స్టెప్పులేసిన సుమ

Dance Perfomance of Anchor Suma
Dance Perfomance of Anchor Suma

జిమ్మిక్కి క‌మ్మ‌ల్.. ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న పాట.. ఇప్పటికే కోటీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ పాట మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన వెలిప‌డింతె పుస్త‌కం సినిమాలోది‌. ఇందులో యువ‌తీ యువ‌కులు క‌లిసి పాడుతూ డ్యాన్స్ చేస్తూ క‌నిపిస్తారు. ఇక యూట్యూబ్‌లో ఇదే పాటను యూత్‌ కూడా కొన్ని వీడియోలు చేస్తున్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో ఈ పాట ఇప్ప‌టికే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

`జిమ్మిక్కి క‌మ్మ‌ల్‌` పాట‌కు యాంకర్ సుమ కూడా ఫిదా అయి స్టెప్పులేసింది. ఆ పాట త‌న‌ను డ్యాన్స్ చేయ‌కుండా ఆప‌లేక‌పోతోందంటూ సుమ.. తన డ్యాన్స్ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కేర‌ళ కుట్టి అయిన సుమ‌కు మోహ‌న్‌లాల్ అంటే చాలా ఇష్టం. `జ‌న‌తా గ్యారేజ్‌` షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న‌తో ఫొటో దిగి, ఆయ‌న న‌ట‌నంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో ఫేస్‌బుక్ ద్వారా కూడా తెలియ‌జేసింది.

ఈ పాట భార‌తీయులనే కాదు…ఇత‌ర‌దేశ‌స్థుల‌నూ ఆక‌ర్షిస్తోంది. ఇక ఇటీవల జిమ్మిక్కి క‌మ్మ‌ల్ పాటను ప్ర‌ముఖ అమెరిక‌న్ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మి కిమెల్ కు చాలా న‌చ్చింద‌ని ‌స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలియ‌జేశారు. జిమ్మిక్కి క‌మ్మ‌ల్ చ‌ర‌ణాలు త‌న పేరు జిమ్మి కిమెల్ ను త‌ల‌పిస్తుండ‌టంతో పాట ఆసాంతం ఆస‌క్తిగా విన్నాన‌ని జిమ్మి చెప్పారు. చ‌ర‌ణాలు అర్ధం కాక‌పోయినాపాట త‌న‌కు చాలా న‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఓ సారి మీరు కూడా చూడండి..