గుడ్ లక్ టూ హైదరాబాద్:వార్నర్..

warner

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య నేడు జరిగే మ్యాచ్‌ కీలక సమరానికి తెరలేవనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయలతో దూకుడు మీదున్న హైదరాబాద్‌కు మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో చెన్నై నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌కు నేడు కీలక సమరం ఎదురైంది.

warner

నేడు జరగబోయే మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుని చెన్నైతో తలపడనుంది. ఇక విషయానికొస్తే నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆల్ ది బెస్ట్ చేబుతూ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

గుడ్ లక్ టూ హైదరాబాద్ టీం..హైదరాబాద్‌ ప్రజలు గర్వించేలా చేయాలి అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జట్టును నుంచి నిష్క్రమించిన   విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌కు హైదరాబాద్ అభిమానులు రీట్వీట్ చేశారు. 2016 ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ సారధ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజేతగా నిలిచింది.