బాయ్స్‌…ఇలా లవ్‌ చెయ్యండి : దీపికా

deepika padukone love lessons

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దీపికా పదుకునే దృష్టి ఉన్నట్టుండి లవ్‌ మీద పడింది. తన ఫ్యాన్స్‌కి ప్రేమ పాఠాలు చెబుతోంది. కంటి చూపుతో వేల మాటల్ని చెప్పవచ్చని, కంటి చూపును మించిన భాష మరొకటి లేదని చెప్పుకొస్తోంది.

అయితే మనసులో మాట బయటపెట్టేందుకు తొందర పడవద్దని చెప్పిన దీపికా, ఆలస్యం చేయడం కూడా మంచిది కాదని సూచిస్తోంది. ప్రేమించిన వ్యక్తిపై భావాలను వారికి అర్ధమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యమని తెలిపింది.

 deepika padukone love lessons

అలాగని అతిగా పొగడవద్దని , అతి పొగడ్తలు మొదటికే మోసమని కూడా హెచ్చరించింది. పొగడ్తలో నిజాయతీ ఉండాలని, ఆ పొగడ్త నిజమేకదా అనేలా ఉండాలని చెప్తోంది. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎప్పుడూ అగ్నిలా రగులుతుండాలని, భాగస్వామిని నిత్యం ఉత్సాహంగా ఉంచాలని సూచించింది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉండడానికి కావాల్సినవన్నీ చేస్తుండాలని చెప్పింది.

ఒకసారి ఒక వ్యక్తి ప్రేమ నుంచి దూరమైతే దానిని మనసులోంచి పూర్తిగా తీసెయ్యాలని, అలా చేస్తేనే.. మరోవ్యక్తితో రిలేషన్ షిప్ లోకి వెళ్లినా నిజాయతీగా ఉంటుందని సూచించింది ఈ బాలీవుడ్‌ బ్యూటీ.