జోగేంద్రకి వీఐపీ బ్రేక్….!

Dhanush breaks Nene Raju Nene Mantri release

‘బాహుబలి-2’ లాంటి సంచలనం తర్వాత రానా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డైరెక్టర్‌గా చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టిన తేజ.. భల్లాలదేవుడిని జోగేంద్ర పాత్రలో ఎలా చూపించారనేది ఆద్యంతం ఆసక్తికరం. ఇవాళ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా సినిమా హిట్‌ టాక్‌ సంపాదించుకుంది.

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన రానాకు తెలుగుతో పాటు మిగతా భాషల్లోనే మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో నేనే రాజు నేనే మంత్రి మూవీనీ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు నిర్మాతలు. ముందుగా అనుకున్నట్లే ఆగష్టు 11న తెలుగుతో పాటు తమిళంలోనూ డేట్‌ ఫిక్స్ చేశారు. అయితే తెలుగులో థియేటర్‌లు సర్దుబాటు అయినప్పటికీ తమిళంలో నేనే రాజు నేనే మంత్రి మూవీ విడుదలకు థియేటర్స్  దొరకకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది.

లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి తమిళంలో ధనుష్ ‘వీఐపీ’ మూవీ భారీ స్థాయిలో ఈ శుక్రవారమే రిలీజ్ అవుతుండటంతో పాటు.. మరో 4 నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. వాటిలో బాలయ్య నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి (తమిళం వెర్షన్)’ కూడా ఉండటం విశేషం. అయితే ధనుష్ వీఐపీ 2 మూవీకోసం చాలా థియేటర్స్ ముందే బుక్ కావడం.. అలాగే నేనే రాజు నేనే మంత్రి మూవీకి చాలినన్ని థియేటర్స్ దొరక్కపోవడంతో జోగేంద్రకు బ్రేక్ పడక తప్పలేదు.