పాపం.. దిల్ రాజుకు ఎంత కష్టమొచ్చింది..

Dil Raju upset with Rana, Suresh Babu

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ డిస్ట్రబ్యూటర్ గా కూడా దిల్ రాజు కు మంచి గుర్తింపు ఉంది. సినిమాలు జడ్జ్ చేయడంలో, తన సినిమాల్ని ట్రిమ్ చేయడంలో దిల్ రాజు దిట్ట అని ప్రతి ఒక్కరు అంటారు. తాను తెరకెక్కించే ప్రతి సినిమా క్లైమాక్స్ లో తాను ఓ చేయి వేసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లతాడు.

Dil Raju upset with Rana, Suresh Babu

తాజాగా ఫిదా లోను అలాగే చేసాడు. ఈ సినిమాను దిల్ రాజే విడుదల చేశాడు.. ఆయన సొంత డిస్ట్రిబ్యూషన్‌ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ అయిన దిల్ రాజు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలయిన రెండు సినిమాలను  పలు థియేటర్లలో విడుదల చేశాడు. లై సినిమా, జయ జానకి నాయకా సినిమాలను దిల్‌ రాజు డిస్ట్రిబ్యూషన్‌ చేశారు.

ఈ రెండు  సినిమాలూ ధియేటర్లలో సందడి చేయాలంటే మరి ఉన్న సినిమాలను తీసేయాల్సిందే. అంటే దిల్‌ రాజు కు పంట పండించిన ఫిదా సినిమాను తీసేసి ఆ థియేటర్లలో ఈ రెండు సినిమాలను ప్రదర్శించాలి. అయితే ఇంతకు   ‘ఫిదా’ సినిమా  ను ఇప్పుడు థియేటర్లలో ఉంచారా..? లేక తీసేసారా.. అంటే  రిలీజైన ఈ రెండు  సినిమాల టిక్కెట్లు కొనడానికి వెళ్ళినప్పడు.. అక్కడ చాలామందికి బ్లాక్ బస్టర్ 4వ వారం అంటూ ‘ఫిదా’ పోస్టర్లు దర్శనమిచ్చాయి. జయ జానకి నాయకా, లై సినిమాలతో పాటు స్టార్‌ ప్రొడ్యూసర్‌ దగ్గుబాటి సురేష్‌ బాబు తనయుడు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా ఇదే సమయంలో విడుదల కావడంతో ఆ సినిమాకు కొన్ని థియేటర్లను కేటాయించారు.

దీంతో దిల్ రాజు సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడింది. పైగా ధియేటర్ ఓనర్లు కూడా కొత్త సినిమాలు కావాలని తహతహలాడుతుంటారు. అందుకే మరి ఫిదా సినిమాను ఎత్తేసి ఈ రెండు సినిమాలను దించాడా.. లేక ఫిదా అలాగే ఉంచి మరీ ధియేటర్లను సర్దుబాటు చేశారా అనేదే చూడాల్సి ఉంది. మొత్తానికి  ఫిదా సినిమా తరువాత దిల్ రాజు పూర్తి స్థాయిలో కోలుకున్నారట.  వరుస ఫ్లాపుల కారణంగా  దిల్‌ రాజు అప్పట్లో 100 కోట్ల పైగా అప్పుల్లో ఉన్నారని టాక్ ఉండేది. కాని ఈ ఏడాది శతమానం భవతి.. నేను లోకల్.. డిజె.. ఫిదా సినిమాలు మంచి వసూళ్లను రాబట్టి ఆయనకు ఉపశమనం కలిగించాయి.