భావన కేసులో కీలక ఆధారాల కోసం వేట..

కేరళ చిత్ర పరిశ్రమతో పాటు యావద్దేశం షాక్ తినేలా ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిపించిన హీరో ఉదంతం పెను సంచలనంగా మారింది. అయిత నటి భావన కేసు ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇండస్ట్రీ సూపర్‌ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సదరు హీరో ఇంత దుర్మర్గానికి ఎందుకు పాల్పడ్డాడు.? రీల్ హీరో రియల్ విలన్ గా మారటానికి దారి తీసిన కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అరెస్టు అయిన దిలీప్‌కు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల అభ్యర్థన మేరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ సహా ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కుట్రకు దిలీపే సూత్రధారి అని సునీ విచారణలో చెప్పాడు. పోలీసుల విచారణలో రోజుకో నిజం వెలుగుచూస్తోంది..

Dileep Wanted Actress Assaulted, Nude Photos

సీనియర్ హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేయడం.. కొన్ని రోజుల నుంచి విచారిస్తుండటం.. కోర్టు అతడికి బెయిల్ కూడా నిరాకరించడం తెలిసిందే. ఐతే దిలీప్ అరెస్టయినంత మాత్రాన ఈ కేసు తేలిపోయినట్లుగా పోలీసులు భావించట్లేదు. అతను కుట్రకు బాధ్యుడని తేల్చే.. కీలక ఆధారాల కోసం వేట కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ కేసులో హీరోయిన్ ను కిడ్నాప్ చేసి ఆమెపై కారులో లైంగిక దాడికి పాల్పడినప్పుడు తీసిన ఎంఎంఎస్ వీడియో క్లిప్ కీలక సాక్ష్యం అవుతుందని భావిస్తున్నారు.

Dileep Wanted Actress Assaulted, Nude Photos

హీరోయిన్ని కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పల్సర్ సుని.. ఆమెను వీడియో తీసినట్లు అంగీకరించినట్లు.. ఆ క్లిప్ ఓ మెమొరీ కార్డులో పెట్టి దిలీప్ కు ఇచ్చినట్లు అంగీకరించాడని సమాచారం. ఐతే ఆ వీడియో ఎక్కడన్నదే తెలియట్లేదు. దిలీప్ భార్య కావ్య మాధవన్ కు చెందిన ఓ స్టోర్లో ఈ మెమొరీ కార్డు కోసం గత నెలలో పోలీసులు విచారణ జరిపారు. కానీ అక్కడ కూడా అది దొరకలేదని తెలుస్తోంది. దిలీప్ లాయర్ దగ్గర ఈ మొమొరీ కార్డు ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే అతణ్ని కూడా అరెస్టు చేయొచ్చని అంటున్నారు. దిలీప్ ఫోన్లోని డేటాను పరిశీలించగా.. అతడి కాల్ వివరాలు.. ఇతర సమాచారం ఉంది కానీ.. ఎంఎంఎస్ క్లిప్ మాత్రం దొరకలేదని సమాచారం. మరి ఈ క్లిప్ ఉన్న మెమొరీ కార్టు ఎక్కడుందో.. దాన్ని పోలీసులు ఎలా సంపాదిస్తారో చూడాలి.