ఇంకా టన్నుల టన్నులున్నాయ్..

Director Bobby Speech At 'Jai Lava Kusa' Press Meet

హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ‘జై లవ కుశ’ ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బాబీ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అందరూ తెలుగు ఇండస్ట్రీకి కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేంత గొప్పనటుడు జూనియర్ ఎన్టీఆర్ అని బాబీ ప్రశంసించాడు. జూనియర్ ఎన్టీఆర్ అనే నటనా సముద్రం నుంచి తాను ట్యాంకర్ తో పట్టుకుపోతున్నానని దర్శకుడు సుకుమార్ అనడంపై ఆయన స్పందిస్తూ, తానేమీ ట్యాంకర్ తో పట్టుకుపోలేదని, ఇంకా టన్నుల టన్నులు ఆ సముద్రంలో ఉన్నాయని అనగానే చప్పట్లు మోగిపోయాయి.

ఈ కథ చెప్పగానే జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారని, ఈ సందర్భంగా కోన వెంకట్ తనకు ఎంతో సహకరించారని అన్నారు. ఈ చిత్రం గురించి ఇంకా ఇంకా మాట్లాడుకునే రోజులు ముందున్నాయంటూ బాబీ చెప్పుకొచ్చారు.