మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్‌తో పూరీ నెక్ట్స్‌ సినిమా..

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ మెహబూబా సినిమా తీశాడు. కానీ తన రొటీన్ స్టయిల్ లో కాకుండా ఇండియా – పాక్ వార్ బ్యాక్ డ్రాప్ గా మెహబూబా సినిమా రూపొందించాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ నుంచి పూరి బయటపడకుండానే మరో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే తన తరవాత సినిమా కూడా కొడుకుతోనే తీస్తానని పూరి జగన్నాథ్ ముందే ప్రకటించాడు.

Puri Jagannath Next Movie!

అందుకు తగినట్టే తరవాత సినిమా పనులు కూడా ప్రారంభించాడట. తాజాగా మెహబూబా సినిమా ప్రమోషన్ కోసం పూరి తన టీం యూఎస్ వెళ్లారు. పనిలో పనిగా తరవాత సినిమా కోసం లోకేషన్ల వేట కూడా సాగించేస్తున్నారనేది తాజా సమాచారం. ఈసారి తీసే మూవీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా తీయబోతున్నాడని తెలుస్తోంది. మెహబూబాకు మౌత్ టాక్ బాగుందని.. నెమ్మదిగా పికప్ అవుతుందని పూరి మొదట్లో లెక్కేశాడు. కానీ అలా ఏమీ జరగలేదు.

మెహబూబా చేదు అనుభవం నుంచి బయటకు రావాలంటే వీలైనంత త్వరగా నెక్స్ట్స్ సినిమా మొదలుపెట్టేయడమే మంచిదనే ఆలోచనలో పూరి ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఈ మూవీ కూడా తన సొంత నిర్మాణ సంస్థలోనే తీయబోతున్నాడట పూరీ.