దీపాలు వెలిగించిన ‘కాటమరాయుడు’

Diwali look of Katamarayudu

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని సినిమా యూనిట్ భావిస్తోంది. దీపావళి సందర్భంగా తాజాగా ఆ చిత్ర‌బృందం ప్రేక్ష‌కుల‌కు పండుగ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ‘కాటమరాయుడు’ ప‌వ‌న్ క‌ల్యాణ్, శ్రుతి హాసన్ కలసి దీపాలు వెలిగిస్తోన్న ఫొటోను విడుద‌ల చేసింది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను శనివారం రాత్రి విడుదల చేశారు. పవన్‌ సినిమా కబుర్లంటే అభిమానులకు దీపావళి సంబరాల్ని మించిపోయిన ఆనందం. మోషన్‌ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేశాడు పవన్‌.

 unnamed (3)

బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి

‘సమయము లేదు మిత్రమా..’ అంటూ ఈ దసరాకి టీజర్‌తో సందడి చేశాడు నందమూరి బాలకృష్ణ. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నటుడిగా బాలయ్యకు వందో చిత్రం. పైగా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతోంది. అందుకే ఈ సినిమాపై ఇటు అభిమానులు, అటు చిత్రసీమ దృష్టి నిలిపింది, ‘గౌతమి…’కి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా విశేషంగా చర్చించుకొంటోంది. దీపావళి సందర్భంగా యుద్ధ రంగంలో కదం తొక్కుతున్న గౌతమిపుత్రుడి లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. డిసెంబరులో పాటల్ని విడుదల చేస్తున్నారు. శ్రియ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు.

unnamed (4)