పారదర్శకంగా డబుల్‌ ఇండ్లు..

cm kcr

తెలంగాణలో 3 లక్షల ఇండ్లు కట్టితీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు,గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఇళ్లు కట్టితీరుతామన్నారు.

నాడు కాంగ్రెస్ హయాంలో ఇళ్ల ప్రాజెక్టు పెద్ద కుంభకోణమని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఒక్కరూపాయి ఖర్చుపెట్టకుండా ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందన్నారు.ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు

లబ్దిదారుల ఎంపికలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లాటరీల ద్వారా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేల కూడా లబ్దిదారుల ఎంపికలో జోక్యం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.