ఛాలెంజింగ్‌గా అనిపించింది..

Dulquer Salmaan says dubbing in Telugu..

దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. ఓకే.. బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సల్మాన్. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. కీర్తీ సురేష్‌, దుల్కర్ ఇద్దరు పోటీ పడి మరీ నటించారు.

 Dulquer Salmaan says dubbing in Telugu..

ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సినీ ప్రముఖుల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో సావిత్రి భర్త పాత్ర పోషించి నటన పరంగా మంచి మార్కులు అందుకుంటున్నాడు సల్మాన్ దుల్కర్. ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. మలయాళి నటుడైన అయిన దుల్కర్‌కు తెలుగు మీద పట్టుకులేకపోయినా డబ్బింగ్‌ను మాత్రం చాలా ఛాలెంజ్‌గా తీసుకున్నాడట.

తెలుగులో డబ్బింగ్ చెప్పేముందు దానిని అర్థం చేసుకుని పదాలను ప్రాక్టీస్ చేసుకున్నాకే డబ్బింగ్ చెప్పాలని అంటున్నాడు దుల్కర్. ఈ మధ్యే విడుదలైన ‘మహానటి’ సినిమా సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ తెరపై ‘మహానటి’గా ఎదిగిన సావిత్రి తెర వెనక జీవితం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంతో చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతి మూవీస పతాకంపై అశ్వినీదత్, స్వప్నదత్, ప్రయాంకదత్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.