బ్రావో పాట.. ధోనీ, రైనా కూతుళ్ల డ్యాన్స్ …

Dwayne Bravo Song Celebrate Suresh Raina's Daughter's Birthday

ఐపీఎల్-11 సీజన్‎లో చెన్నై సూపర్ కింగ్ జట్టు వరుజ విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్ బెర్త్‎ను కన్ఫార్మ్ చేసుకుంది. మరోవైపు ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక సార్లు ప్లే ఆఫ్ చేరిన జట్టుగా చెన్నై కొత్త రికార్డు సృష్టించింది. చెన్నై ఆటగాళ్లు మాత్రం ఏ మాత్రం ఖాళీ సమయం ఉన్నా ఫుల్‎గా ఎంజాయ్ చేస్తుంటారు. రైనా కూతరు గ్రేషియా బర్త్‎డే వేడుకల్లో పాల్గొన్న చెన్నై ఆటగాళ్లు ఆటా.. పాటలతో సందడి చేశారు.

ఈ పార్టీలో చెన్నై ఆల్ రౌండర్ ఆటగాడు బ్రావో పాట పాడాడు. ఈ పాటకి కెప్టెన్ ధోనీ కూతురు జీవా, రైనా కూతురు గ్రేసియా సెప్టులు వేశారు. బ్రావో పాడిన ఈ పాట 2016లో ఎన్నో టీమ్స్‎కు విక్టరీ థీమ్‎గా మారిపోయింది. ఇప్పడు ఇదే సాంగ్‎ను బ్రావో పాడి అందరిని అలరించాడు. ఈ వీడియో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంజైజీ తమ ట్విట్టర్ అకౌంట్‎లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి ఇక.