ఉత్తరాఖండ్…జలీల్ ఖాన్

Education Minister asked teacher wrong question

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వారుండరు. ఇటీవలి కాలంలో ఎవరిపై సెటైర్లు వేయాలన్న ఈ పేరునే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఎందుకంటే బీకాంలో ఫిజిక్స్‌లో ఉంటుందని చెప్పి వార్తల్లో నిలిచాడు.

తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మంత్రి జలీల్‌ఖాన్‌కి ఏ మాత్రం తీసిపోలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో తనిఖీ కోసం ఓ పాఠశాల వెళ్లిన  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అరవింద్  పాండే ఆయన తెలిసి తెలియని తనంతో నవ్వుల పాలయ్యారు.

డెహ్రాడూన్ లోని మహిళా ఇంటర్ కాలేజ్ కు వెళ్లారు. అక్కడ ఓ క్లాసులోకి వెళ్లారు.  అప్పుడు అక్కడ సైన్స్ క్లాస్ జరుగుతోంది.  అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్న ఆయన.. మైనస్ ప్లస్ మైనస్ ఎంతవుతుందని క్లాస్ టీచర్ ని అడిగారు. అప్పుడు మైనస్ అని ఆన్సర్ ఇచ్చింది టీచర్. వెంటనే ఆగ్రహించిన ఆయన.. ప్లస్ అవుతుందన్నారు. నేను కూడా సైన్స్ చదివా అంటూ టీచర్ ను గదమాయించారు.

మహిళవు కాబట్టి ఏం అనటం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న అధికారి.. మంత్రిగారిది తప్పని తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి గారిని నెటిజన్లు ఆటాడకుంటున్నారు.