పంజా విసిరిన మావోలు..8 మంది జవాన్లు మృతి

Eight CRPF personnel killed in Sukma district

చత్తీస్ గడ్ అడవులు మరోసారి నెత్తురోడాయి.కీకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది.బీజాపూర్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన మావోయిస్టులు పంజా విసిరారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కొల్పోగా ప్రతీకారంతో రగిలిపోతున్న మావోలు..సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై విరుచుకపడ్డారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.