ఆలోచనలో పడిన రామ్….

Energetic Star Ram's Trouble To next film lands

ఎనర్జిటిక్ హీరో రామ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు నేర్పర్చుకున్నారు. రామ్ ప్రస్తుతం హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగానే.. రామ్ మరో సినిమాపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఆయన గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ డైరెక్టర్ చెప్పిన కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ విదేశాలలో జరుపుకోవలసి ఉంటుంది. ఈ సినిమాను తాము నిర్మిస్థామని చెప్పిన భవ్యక్రేషన్స్ అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది.

Energetic Star Ram's Trouble To next film lands

ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించేందుకు స్రవంతి బ్యానర్ ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు వీళ్లకు కూడా బడ్జెట్ విషయంలో సందేహాలు మొదలైనట్టుగా ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉండడంతో అటు రవి కిషోర్, ఇటు రామ్ ఇద్దరూ ఆలోచనలో పడినట్టుగా ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ చిత్రాన్ని రవికిషోర్ నిర్మిస్తాడో లేదో చూడాలి ఇక.

Energetic Star Ram's Trouble To next film lands

మరోవైపు ‘హలో గురు ప్రేమకోసమే’తో రామ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లవ్ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ కి సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్రానికి నేను లోకల్ ఫేమ్ డైరెక్టర్ త్రినాధరావు నక్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చి్త్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు.ఈ
చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.