సాయి పల్లవి నిజంగానే అలా చేస్తుందా?

sai-pallavi

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే భానుమతి‌గా ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసి.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఒక్క రోజులోనే అమ్మడి హోదా సౌత్ లో టాప్ కి చేరింది. ఇక ఆఫర్స్ కూడా చాలానే అందుకుంటోంది. కానీ అమ్మడు మాత్రం కేవలం తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం ప్రస్తుతం ఈ హైబ్రీడ్ పిల్ల నాని ‘ఎంసిఏ’ సినిమాలో నటిస్తుంది. అలాగే ఏఎల్.విజయ్ దర్శకత్వంలో కణం అనే సినిమాలో నటిస్తోంది.

sai-pallavi

అయితే ప్రస్తుతం ఈ భామపై ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌ స్పాట్‌ కు సరైన సమయంలో వెళ్లడం లేదట. సీన్స్ చిత్రీకరణ కోసం ఉదయం 9:30 గంటలకు చిత్ర యూనిట్ మొత్తం రెడీగా ఉంటే.. మేడం మాత్రం 11-12 గంటలకు వస్తున్నారని కొందరు అంటున్నారు. దీంతో సినిమా హీరోలు చాలా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. కణం సినిమా హీరో నాగశౌర్య అయితే సాయిపల్లవిపై కోపంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

sai-pallavi

అటు ఎంసీఏ సినిమా షూటింగ్‌ కు కూడా సాయిపల్లవి లేటుగానే వెళ్తోందట. దీంతో ఆ చిత్ర యూనిట్‌ సాయిపల్లవిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సాయిపల్లవి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరియర్‌ మంచి సక్సెస్‌ రేటులో ఉన్నప్పుడు ఈ అమ్మడు తన వాలకంతో తనకు తానే నష్టం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.