ఇలా చీర కడితే.. ఏమైపోవాలి ?

Fight masters Ram Laxman fun with Udayabhanu

ఉదయభాను యాంకరింగ్ చేస్తూ స్టేజ్ పై ఉంటే ఏ రేంజ్ హంగామా చేస్తుందో తెలిసిన విషయమే. టీవీల్లోనూ.. స్టేజ్ లపైనా ఓ రేంజ్ లో అల్లరి చేసి మెప్పించచ్చని తెలియచెప్పింది ఈమే. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను.. నక్షత్రం ఆడియో వేడుకలో ఇతర యాంకర్లకు నక్షత్రాలు చూపిస్తానంటూ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆదివారం గోపీచంద్ హీరోగా నటించిన ‘గౌతమ్ నందా’ ఆడియో ఫంక్షన్ లో ఉదయభాను యాంకర్‌గా చేసింది. ఉదయభాను యాంకరింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే.. అతిథులను వేదికపైకి పిలవడంలో భాగంగా ఫైట్ మాస్టర్లు రామ్ లక్షణ్ లను వేదికపైకి ఆహ్వానించిన ఉదయభాను వారిద్దరి గురించి కాస్త ఎక్కువగానే చెప్పింది.

gautam nanda audio launch 1

స్టేజి పైకి వచ్చిన రామ్ లక్ష్మణ్ లు మైక్ అందుకుని.. ఉదయభాను చెప్పిందంట ఉత్తదే అన్నారు… తమ గురించి ఏదో అభిమానం కొద్దీ అలా చెప్పిందని, పెద్ద పొగడ్తలకు తాము అర్హులం కామని వినమ్రంగా తెలిపారు. ఇదే సందర్భంగా ఉదయభానుపై చిలిపిగా కామెంట్ చేశారు. ‘నువ్వు వస్తేనే చాలా బ్రైట్… మరి, ఇలాంటి బ్రైట్ చీర కట్టుకుని వస్తే, కుర్రాళ్ల పరిస్థితి ఏంటని’ సరదాగా అన్నారు. ఇప్పటికే తమ ఫేవరెట్ హీరోయిన్ ఉదయభానే అని రామ్ లక్ష్మణ్‌లు అన్నారు. తాము హీరోలుగా నటించిన ‘ఖైదీ బ్రదర్స్’ సినిమాలో భాను హీరోయిన్ గా నటించిందని , ఆ అభిమానంతోనే తమను కొంచె ఎక్కువగా పొగిడిందని అన్నారు.