24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

TRS, Rythu Bandhu scheme, Congress, BJP , Etela Rajender, welfare scheme

వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ చేసిన ఆయన… టీఆర్‌ఎస్ పార్టీ ఒక్క యూనిట్ క‌రెంట్‌ ఉత్పత్తి చేసిందా.. అంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.  ఉత్పత్తి గురించి కాదు రైతులకు 24 గంటల కరంటు ఉచితంగా వ్యవసాయానికి ఇస్తుందా లేదా అనేది ముఖ్యమన్నారు.

TRS, Rythu Bandhu scheme, Congress, BJP , Etela Rajender, welfare scheme

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎందుకు 24 గంటల కరంటు ఇవ్వడం లేదని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన పనుల చలువేనన్నారు. రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్న ఘనత కేసీఆర్‌దేనని పునరుద్ఘాటించారు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ రూ.3380 వేల కోట్లు రుణమాఫీ చేస్తే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రూ.17వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని యాత్రలు చేసిన ప్రజలు నమ్మరని  ఎద్దేవా చేశారు.