You are here

డేరాబాబా ఓ కామపిశాచని తేల్చిన వైద్యులు

డేరా సచ్చా సౌదా కేంద్రంగా గుర్మిత్ రామ్ రహీం సాగించిన అరాచకాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇద్దరు సాథ్వీలపై అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా ఓ కామపిశాచి అని వైద్యులు తేల్చి చెప్పారు. ఇన్నాళ్లుగా అనుభవించిన సుఖవంతమైన జీవితం అంతం కావడం.. 20 ఏళ్లు జైలు శిక్ష పడడంతో గుర్మీత్‌ మూడీగా ఉంటూ, గోడలతో మాట్లాడుతూ, ఏడుస్తూ గడుపుతున్నాడు. సరిగా భోజనం కూడా చేయకపోవడంతో అతనికి జైలులో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం పలు విషయాలను జైలు అధికారులకు తెలిపారు.

ఆయన రెగ్యులర్‌ గా అనుభవిస్తున్న శృంగార జీవితానికి ఒక్కసారిగా దూరం కావడంతో ఈ విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వారు చెప్పారు. రోజూ శృంగారానికి అలవాటు పడిన గుర్మీత్ సింగ్, అందులో పటుత్వానికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకునేవాడని అన్నారు. జైలుకు వచ్చేముందు దాకా రెగ్యులర్‌గా ఎనర్జీ డ్రింక్స్‌ను తీసుకునేవారని సమాచారం. ఒకప్పుడు మంసాహారి, మద్యానికి బానిస అయిన గుర్మీత్‌.. ఇప్పుడు మద్యం, మాంసం మానేశాడని తెలిపారు. సుఖాలన్నీ ఒక్కసారిగా దూరం కావడంతో తట్టుకోలేకపోతున్నాడని, ఆయనకు చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే సమస్య మరింత పెరుగుతుందని సదరు వైద్యులు వెల్లడించారు.

Ram Rahim had an illicit relationship with adopted daughter Honeypreet

ఇదిలాఉండగా డేరా బాబా దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది. డేరా బాబా ముసుగు వేసుకుని అంతులేని అక్రమాలకు పాల్పడిన గుర్మీత్ రాం రహీం సింగ్ ను శిక్ష పడిన అనంతరం తప్పించేందుకు ప్లాన్ వేసిందని, ఆ తరువాత పరారైందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో తలదాచుకున్న ఆమెను పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం.

Related Articles