డేరా స్కూల్‌…బాలికలనూ వదల్లేదు…!

Gurmeet sexually abused minor students of Dera school

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చ సౌధా చీఫ్ గుర్మీత్ రహీమ్ సింగ్ గురించి రోజుకో చీకటి నిజాలు వెలుగుచూస్తున్నాయి. గుర్మీత్ ఓ సెక్స్ పిశాచి అంటూ ఆయన ఆరోగ్య పరిస్ధితిని గమనిస్తున్న డాక్టర్ వెల్లడించగా… డేరా ఆశ్రమంలో 90 శాతం మందిపై లైంగిక  దాడికి పాల్పడ్డాడన్న వార్త భయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. సాధ్వీలపైనే కాదు.. అన్నెంపున్నెం ఎరుగని స్కూల్‌ చిన్నారులపైనా గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ దాష్టీకాలకు పాల్పడ్డాడట. ఈ విషయాన్ని డేరాలో  పనిచేసిన గురుదాస్‌ సింగ్‌ టూడ్‌ అనే వ్యక్తి వెల్లడించారు.

డేరా పాఠశాలలో 10మంది బాలికలను రాంరహీం లైంగికంగా వేధించారన్నారు. బాధితులంతా తనకు తెలుసని.. వారిలో చాలామందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయన్నారు. వారిలో చాలామందితో రాంరహీం టచ్‌లో ఉండేవారని అన్నారు. అటు బాధితుల్లో ఓ మహిళ.. ఈ విషయాలను ధ్రువీకరించడం విశేషం. ప్రస్తుతం పెళ్లిచేసుకొని అమెరికాలో స్థిరపడిన సదరు మహిళ.. తాను డేరా బడిలో ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో రాంరహీం తనతో జుగుప్సాకరంగా ప్రవర్తించేవాడని వాపోయింది. డేరా ఆస్పత్రిలో రోగులకు చికిత్సకన్నా బాలికల గర్భస్రావాలే ఎక్కువ జరిగేవని టూడ్‌ చెప్పారు. డేరా సభ్యుడిగా స్వయంగా మూడు అబార్షన్లు జరగడాన్ని చూశానని ఆమె వెల్లడించింది.