హన్సిక బర్త్ డే సెలబ్రెషన్స్ అదుర్స్…

Hansika Motwani celebrates her Birthday

దేశ ముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక… తొలి సినిమాతోనే కుర్ర కారును కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత హన్సిక పేరు మార్మ్రోగిపోయింది. అవకాశాలు కూడా అలానే వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన హన్సిక కొద్ది కాలం తర్వాత కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.ఇప్పుడు మళ్ళీ తెలుగు వైపు వచ్చింది.

Hansika Motwani celebrates her Birthday

1991 ఆగస్టు 9న పుట్టిన హన్సిక ఈరోజు తన 26వ పుట్టినరోజు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె స్నేహితులు గత రాత్రి ఆమెను సర్పరైజ్ చేశారట. ముంబయ్ లోని హన్సిక ఇంటిని వారు డెకరేట్ చేసేసి.. నైట్ ఈమెను ఒక పార్టీకి తీసుకెళ్లి.. అక్కడి నుండి తిరిగొచ్చేసరికి ఓ రేంజులో సెలబ్రేట్ చేశారట. దానితో హన్సిక కూడా ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ ఫోటోలన్నీ తనే తన మీడియా మిత్రులకు షేర్ చేసింది. హన్సికతో పాటు ఆమె మమ్మీ కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేసిందట.ఈ రోజే మహేష్ బాబు పుట్టిన రోజు కూడా కావడం విశేషం.