ఐ లవ్యూ స్వీట్ హార్ట్ : నాగార్జున

nagarjuna mala

అమల అక్కినేని, తెలుగు సినిమా నటి మరియు జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిద్దరిని 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది.

Happy Birthday Amala Akkineni

నేడు తన భార్య అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు. ‘ఐ లవ్యూ స్వీట్ హార్ట్’ అంటూ తన మనసులోని ప్రేమను వెలిబుచ్చారు. అమలతో కలిసున్న రెండు ఫోటోలను అభిమానులతో పంచుకున్న నాగార్జున, హ్యాపీ బర్త్ డే, నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా, ‘శివ’ వంటి సూపర్ హిట్ చిత్రంతో పాటు ‘నిర్ణయం’ వంటి చిత్రాల తరువాత పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే.