‘హ్యాపీ వెడ్డింగ్’ ఫస్ట్ లుక్..!

ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగాడాటర్ నిహారిక. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోయిన నటన పరంగా నిహాకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ మెగా డాటర్ ప్రస్తుతం హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా ద్వారా లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌  చేశారు చిత్ర యూనిట్‌.

Happy Wedding Movie First Look And First Invitation

అయితే దీంతో సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 14)న అందుకు తగ్గట్టుగా ఒక స్పెషల్ ఫస్ట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్ బ్యాక్ గ్రౌండ్ తో పాకెట్ సినిమా ప్రొడక్షన్ వారు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక హీరోగా ఎమ్ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ నటిస్తున్నాడు.