కర్ణాటక సీఎంకు మోదీ ఫిటెనెస్ ఛాలెంజ్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి ఫిట్‌నెస్ సవాలు విసిరారు. మూడు వారాల క్రితం తన ఫిటెనెస్ కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసి కోహ్లి.. మీ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని తన భార్య అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ ధోనీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. అయితే మోదీ ఈ సవాలును స్వీకరించి ఆయన ఫిట్‌నెస్‌ వీడియోను ట్వట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Narendra Modi

యోగాతోపాటు మార్నంగ్ వాక్ చేస్తున్న తనకు ప్రకృతిలోని ఐదు పంచతత్వాలు స్పూర్తినిచ్చాయని మోదీ ట్వట్టర్‌లో పేర్కొన్నారు. వాకింగ్ చేస్తున్న తనకు పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశంలతో స్ఫూర్తి పొందానని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. అంతేకాదు ప్రధాని తన ఫిట్‌నెస్ వీడియోని పోస్ట్ చేస్తూ సీఎం కుమారస్వామితోపాటు టిటి ఛాంపియన్ మనికా బాత్రాకు ఫిట్‌నెస్ సవాలును జారీ చేశారు. 40 ఏళ్ల వయసు దాటిన ఐపిఎస్ అధికారులకు కూడా మోదీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

Narendra Modi

ఈ ఫిటె నెస్ ఛాలెంజ్ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ నుంచి ప్రారంభమైంది. ఖేల్ ఇండియా పథకాన్ని పురస్కరించుకొని క్రీడా మంత్రి ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. మనం ఫిట్‌గా ఉంటే ఇండియా ఫిట్‌గా ఉంటుందనే హ్యాష్‌ట్యాగ్‌తో తను ఎక్సర్‌సైజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన రాథోడ్..బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్‌లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికు ఛాలెంజ్ విసిరారు. రాథోడ్ ఛాలెంజ్ ను స్వీకరించిన కోహ్లి.. ప్రధానిమోడీని ట్యాగ్ చేస్తూ తన ఫిట్‌నెస్ ఫ్రూవ్ చేసుకున్నాడు.