You are here

టోల్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ జాం

వరుస సెలవులతో హైదరాబాద్ జనం ఊళ్ల బాట పట్టారు. హైదరాబాద్ నుంచి జనం సొంతూర్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవే మీద టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, పగిడిపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ అయ్యింది. వాహనాలు టోల్‌ప్లాజా దాటడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది.శ్రావణమాసం కావడం పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలుండటం.. వరుసబెట్టి సెలవులు రావడంతో.. పెద్ద ఎత్తున జనం సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు.

రెండో శనివారం, ఆదివారం, కృష్ణాష్టమి, ఆగస్టు 15 సెలవులు రావడంతో.. ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లడానికి బారులు తీరారు. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డులో ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Related Articles