అఖిల్‌కు షాకిచ్చిన నాగ్…!

HELLO Wedding Song

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మాతగా  అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. ‘మనం’ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీకి అద్భుత విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

HELLO Wedding Song
కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన అంశాన్ని రేపు విడుదల చేస్తానని అఖిల్‌ మంగళవారం ప్రకటించారు. అయితే ఆయనకన్నా ముందు నాగార్జున దాన్ని విడుదల చేసేశారు.సారీ రా అఖిల్‌.. నువ్వు విడుదల చేసే వరకు ఈ పాటను చూపించకుండా ఆగలేకపోయాను. నువ్వు ఇంకా స్పీడ్‌ అవ్వాలి అని నాగ్‌ ట్వీట్‌ చేశారు. మెరిసే మెరిసే మెరిసే.. అంటూ ఓ పెళ్లి వేడుకలో అఖిల్‌, కల్యాణి  డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. పాట సెట్‌, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి.