నితిన్ ‘శ్రీనివాస క‌ళ్యాణం’ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

Hero Nithin’s new movie Srinivasa Kalyanam gets a release date

యంగ్ హీరో నితిన్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా నితిన్ న‌టించిన ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. అయితే నితిన్ ప్ర‌స్తుతం చేస్తున్న‌ సినిమా శ్రీనివాస క‌ళ్యాణం. ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 14సంవ‌త్స‌రాల తర్వాత మ‌ళ్లీ వీరిద్దరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుండ‌టం విశేషం. దిల్ సినిమాతో టాప్ ప్రోడ్యూస‌ర్ గా ఎదిగిపోయాడు దిల్ రాజు. ఈ సినిమాతోనే ఇత‌ని పేరు దిల్ రాజు గా మారిపోయింది. శ్రీనివాస క‌ళ్యాణం సినిమాకు శ‌త‌మానం భ‌వ‌తి సినిమా ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగ‌స్న దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Hero Nithin’s new movie Srinivasa Kalyanam gets a release date

ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనసాగనున్న ఈ కథను, అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అయితే ఈసినిమాను మొద‌ట్లో జూన్ లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల‌పై ఓ క్లారిటి ఇచ్చింది చిత్ర యూనిట్. అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల కాక‌పోవ‌డంతో ఈసినిమా విడుద‌ల తేదిని మార్చారు. ఆగ‌స్టు 9వ తేదిన ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగ‌స్న విరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి సినిమా సూప‌ర్ హిట్ విజ‌యం సాధించింది. ఈసినిమాకు పై భారీ అంచానాలు ఉన్నాయి. నితిన్ స‌ర‌స‌న హీరోయిన్ గా రాశి
ఖ‌న్నా న‌టిస్తుంది.