డ్రగ్స్‌కు బానిసైన మరో టాప్ హీరో ఎవరు..?

Hyderabad drug racket-Top hero under scanner

టాలీవుడ్‌లో కలకం రేపుతున్న డ్రగ్స్‌ దందాలో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది.. ఇప్పటికే కొంత మంది పేర్లను వెల్లడించిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ తాజాగా మరో 15 మంది పేర్లను భయటపెట్టినట్లు సమాచారం. ఇందులో చిన్నచిన్న వేషాలతో సినీ జీవితం ప్రారంభించి ఒకేసారి పెద్దపెద్ద సినిమాలు తీసిన నిర్మాత, పలువురు రాజకీయ నాయకులు పిల్లలున్నట్టు సమాచారం. అంతేకాకుండా టాలీవుడ్ లోని టాప్-5 హీరోల్లో ఇద్దరు తన కస్టమర్లేనని డ్రగ్స్ దందాలో సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన కెల్విన్ తాజాగా వెల్లడించినట్టు తెలుస్తోంది. అతని నుంచి మూడు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకోగా, 2,100కు పైగా కాంటాక్టులు లభించాయి. వాటిల్లో 100కు పైగా కాంటాక్టులు సినిమా వర్గాలకు చెందిన వారివేనని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న వారిలో ఇద్దరి నుంచి ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టుల వరకూ తాను డ్రగ్స్ అందించినట్టు కెల్విన్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగులో టాప్-5 స్థానాలు హీరోలంటే ఈ జాబితాలో ఇప్పటికే రవితేజ పేరు ఇప్పటికే డ్రగ్స్ దందాలో వెలుగులోకి వచ్చింది. ఇంకో హీరో ఎవరన్న విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరో ముగ్గురు, నలుగురు చిన్నాచితకా నటులు కాగా ఎక్కువ మంది ఇతర విభాగాలకు చెందినవారే కొత్త జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. వారి పేర్లను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. విచారణలో పేరు చెప్పినంత మాత్రాన వారిని కేసులో జోడించలేమంటున్న అధికారులు ఆధారాలు సేకరించేందుకు శనివారం సాయంత్రం నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆధారాలు లభించగానే వారికీ నోటీసులు జారీ చేస్తామంటున్నారు.

తాను ఎలా మత్తుమందులు తెచ్చేది, ఎలా వారికి సరఫరా చేసేది, తనకు వారితో ఎలా పరిచయమయిందీ విచారణలో కెల్విన్‌ కథలు కథలుగా చెబుతుంటే అధికారులు నిర్ఘాంతపోయారు. మాదకద్రవ్యాల సరఫరాకు కెల్విన్‌.. డేనియల్‌ అనే వ్యక్తిని వాడుకునేవాడని అధికారులు గురించారు. అనేక మంది అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలను డేనియల్‌ తన ఫోన్‌ ద్వారా కెల్విన్‌కు పంపాడు. మత్తుమందులకు అలవాటుపడిన అమ్మాయిలు డబ్బు లేకపోతే ఇలా ఫొటోలు పంపేవారని కెల్విన్‌ చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. డేనియల్‌ పరారీలో ఉండడంతో పోలీసులు వేట మొదలుపెట్టారు. అయితే ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే కొత్తగా వెల్లడైన పేర్లు బయట పెడతామని చెబుతున్నారు.