భారత్-ఆసీస్ టీ20 రద్దు…

Hyderabad T20I called off

భాగ్యనగరాన్ని వరుణుడు మరోసారి ముంచెత్తాడు. గురువారం కురిసిన భారీ వర్షం నుంచి ఇంకా తేరుకోకముందే శుక్రవారం సాయంత్రం నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన భారత్- ఆస్ట్రేలియా చివరి టీ 20 మ్యాచ్ రద్దైంది.

Hyderabad T20I called off

వాన కార‌ణంగా లేటుగా ప్రారంభించాల‌నుకున్న నిర్వాహ‌కులు మ‌రోసారి పిచ్‌ను ప‌రిశీలించారు. అయితే, వాన త‌గ్గ‌క‌పోవ‌డం, మ్యాచ్ ఆడ‌డానికి వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మైదానంగా చిత్త‌డిగా ఉంద‌ని చెప్పారు. దీంతో అభిమానులు స్టేడియం నుంచి నిరాశ‌గా వెనుదిరిగారు. ఆస్ట్రేలియా, భార‌త్ మొద‌టి రెండు మ్యాచుల్లో చెరొక‌టి చొప్పున గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో సిరీస్ స‌మం అయింది.