కొత్తగా..సరికొత్తగా..కీర్తి..!

I discovered Savitri many things in common

నేను శైలజ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సుందరాంగి కీర్తి సురేష్‌. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకున్న ఈ బ్యూటీ నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్‌’ ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కీర్తి…అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో సావిత్రిగా అలరించనుంది.

తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కీర్తి చెబుతోంది. సావిత్రి గారి బాడీ లాంగ్వేజ్‌ను తెలుసుకున్నానని…ఈ సినిమా చేసేటప్పుడు ఆ విషయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపింది. అంతేగాదు ఈ సినిమాలో కీర్తి పాత్ర కోసం 120 రకాల కాస్ట్యూమ్స్‌ ఉపయోగించారట.

అంతేగాదు తెరపై ఎప్పుడు ఒకేరకంగా కనిపించడం తనకు ఇష్టం ఉండదని కొత్తగా కనబడాలన్నదే తన కోరికని చెబుతోంది. ఒకే తరహా పాత్రలు, గెటప్ లు బోర్ కొడతాయని..ఎప్పటికప్పుడు కొత్తగా కనబడాలంటే కొత్త తరహాపాత్రలే రావాలని కోరుకుంటానని కీర్తి తెలిపింది. కొత్త తరహా పాత్రలే కాదు ఇటీవల పవర్ స్టార్ పవన్‌తో అజ్ఞాతవాసి సినిమా చేసిన కీర్తి..తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది.