నేను పబ్లిక్‌ ఫిగర్‌ని.. ప్రాపర్టీని కాదు : ఇల్లి

ileana Fires on media and Netizens

గోవా బ్యూటీ ఇలియానా నెటిజన్లపై మండిపడింది. ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా, సినిమాల గురించి కాకుండా, తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ, విసిగిస్తున్నారని తన ట్విట్టర్ ఖాతాలో ఫైర్‌ అయింది. తన విషయంలో జరుగుతున్నదంతా బాధను కలిగిస్తోందని వాపోయింది.

నలుగురిలో ఉన్నప్పుడు ఎల్లకాలం నవ్వుతూనే కనిపించలేనని చెప్పింది. తాను పబ్లిక్ ఫిగర్ ని మాత్రమేనని, పబ్లిక్ ప్రాపర్టీనేమీ కాదని, తాను చేస్తున్నది తప్పని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తానూ అమ్మాయినేనని, మీ ఇంట్లో ఆడవాళ్లకు ఇచ్చే గౌరవాన్ని తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించిన ఇలియానా, ఆండ్రూ గురించి ఒకసారి ప్రశ్నిస్తే తప్పులేదని, పదేపదే ఒకే ప్రశ్న ఎదురవుతోందని చెప్పుకొచ్చింది.

 ileana Fires on media and Netizens

అతను తెల్లగా ఉన్నాడు కాబట్టి తాను డేటింగ్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం నచ్చడం లేదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తన డేటింగ్ పై ప్రశ్నలు అడుగుతూ ఉండటం తనకు నచ్చడం లేదని చెప్పింది.

కాగా, ఇలియానా తాజా చిత్రం ‘బాద్ షాహో’ ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రూ.50 కోట్ల వసూళ్ళను రాబట్టింది.