You are here

ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు

ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక్క టీ20 మ్యాచ్ లను గెల్చుకుని భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. గత కెప్టెన్లెవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ సేన సొంతం చేసుకుంది. భారత్‌ శ్రీలంక పర్యటనలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. తాజాగా అస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి భారత్‌ తలపడనుంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరగనుండగా.. తొలి మూడు వన్డేలకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా సెలక్టర్లు ప్రకటించారు. వారి వివరాలు .. విరాట్ కోహ్లీ (కెప్ట్ న్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధోనీ, ధావన్, రాహుల్, పాండే, జాదవ్, రహానె, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కులదీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్, మహ్మద్ షమి శిఖర్, చహాల్, భువనేశ్వర్ కుమార్, షమీ, పాండే లను ఎంపిక చేశారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. కాగా, భారత పర్యటనలో ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆసీస్‌ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ నుంచి శుక్ర, శని వారాల్లో రెండు బృందాలుగా భారత్‌కు వచ్చారు.

Related Articles