గ్యాంగ్ లీడ‌ర్ రీమేక్ లో రాం చ‌ర‌ణ్…

gang leader

మెగాస్టార్ చిరంజీవి 151సినిమాల్లో అతి పెద్ద విజ‌యం సాధించిన సినిమాలలో గ్యాంగ్ లీడ‌ర్ ఒక‌టి. ఆ రోజుల్లో ఆసినిమా 100 ఆడింది. గ్యాంగ్ లీడ‌ర్ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డుల‌ను సొంతం చేస‌కుంది. బాక్సాఫిస్ వద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈసినిమాకు విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా… మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. చిరంజీవి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా గ్యాంగ్ లీడ‌ర్ పెద్ద విజ‌యాన్ని సాధించింది.

chiru, ram cheran

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రో ప్ర‌చారం జ‌ర‌గుతోంది.. గ్యాంగ్ లీడ‌ర్ ను రీమేక్ చేస్తున్నార‌నే వార్త ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌న కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుండి ఈ సినిమాను రీమేక్ చేయ‌డానికి పలువురు నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మెగాస్టార్‌ అద్భుతమైన టైమింగ్‌తో అలరించిన రాజారామ్‌ పాత్రలో రామ్‌ చరణ్‌ను చూసేందుకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే జ‌రుగుతున్న ప్ర‌చారం మేర‌కు ఈసినిమా ప‌ట్టాలెక్క‌బోతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

gang leader
ఇటివ‌లే చిరంజీవి తేజ్ ఐల‌వ్ యూ ఆడియో ఫంక్ష‌న్ హాజ‌ర‌యిన విష‌యం తెలిసిందే. తేజ్ ఐ ల‌వ్ యూ యూవీకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన కేయ‌స్ రామారావు చిరంజీవికి ఎన్నో హిట్ల‌ను అందించాడు. ఈసంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు చిరు. ఆ సినిమా గ్యాంగ్ లీడ‌ర్ రీమేక్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అప్ప‌టి క‌థ‌ను ఈజ‌న‌రేష‌న్ కు త‌గ్గ‌ట్టుగా మార్చి తీయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా..ఆత‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టిస్టార‌ర్ సినిమా చేయ‌నున్నాడు. ఈత‌ర్వాత ఈ గ్యాంగ్ లీడ‌ర్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.