రజినీ 2.Oని మారుస్తారా..?

It's not 2.0 but it is 2.O!

సూపర్‌స్టార్‌ రజినికాంత్ నటించిన ‘రోబో’ సినిమా ఎంతటి సంచలన రికార్డ్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరతెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎస్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోబోకి సీక్వెల్‌గా వస్తున్న’రోబో2.0′ సినిమాని దర్శకుడు శంకర్‌ ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాడు చేస్తున్నాడు.

It's not 2.0 but it is 2.O!

ఇకపోతే అక్టోబర్ లో సినిమా ఆడియోను దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఇక టాలీవుడ్ ప్రేక్షకులపై ప్రేమతో నవంబర్‌లో హైదరాబాదుకు వచ్చి చిత్రబృందం టీజర్‌ని రిలీజ్ చేయనుంది. ట్రైలర్ ను మాత్రం చెన్నైలో డిసెంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కాని ఈ సందర్భంగా వీరు రోబో సీక్వెల్‌ను చాలా స్పష్టంగా.. ‘2.ఓ’ అనే రాస్తున్నారు. అంటే ‘టూ పాయింట్ ఓ’ అని మనం చదవాలన్నమాట. మనం హాలీవుడ్ లో ఎక్కువగా ‘జీరో’ ను ‘ఓ’ను పిలవడం గమనించే ఉంటాం. జేమ్స్ బాండ్ ను కూడా జీరో జీరో సెవెన్ అనకుండా.. ‘డబుల్ ఓ సెవెన్’ అని పిలుస్తుంటారు. ఎలా పలికినా కూడా.. రాసేది మాత్రం 007 అనే. అలాగే ఇప్పుడు రోబో సీక్వెల్ విషయంలో కూడా మనందరం దానిని చదివే తీరు మారాంటే.. 2.ఓ.. ఎలియాస్ ‘టూ పాయింట్ ఓ’ అంటున్నారు.

It's not 2.0 but it is 2.O!

ఇక అక్టోబర్ నుంచే 2.ఓ చిత్ర దర్శకుడు శంకర్ బాహుబలిని మించిన రేంజ్ లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 350 కోట్లతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు చాలా సార్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తుండగా ఏర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.