నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం

Modi ivanka trump
Modi ivanka trump

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోడీ ఆహ్వానం మేర‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ త్వరలో ఇండియాకు రానున్నారు. భారత్‌, అమెరికా దేశాల సంయుక్తాధ్వర్యంలో నవంబరు 28 నుంచి హైదరాబాద్‌లో 3 రోజులపాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల(పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సు కు ఇవాంకా హాజరుకానున్నారు.

Ivanka Trump

ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ గురువారం ట్వీట్‌ చేశారు. రెండు దేశాల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఒకచోటుకు తెచ్చే ఉద్దేశంతోనే మూడురోజులపాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు మోడీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

జీఈఎస్‌-2017కు ప్రధాని మోడీ, ఇవాంకా హాజరుకావడం.. హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చాలా సంతోషంగా ఈ ప్రతిష్ఠాత్మాక సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Telangana cmo

ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహించనుండగా… భారతదేశం తరఫున ప్రధాని మోడీ సారథ్యం వహించనున్నారు. కాగా, ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలను నీతి ఆయోగ్‌కు కేంద్రం అప్పగించింది. దేశంలో తొలిసారిగా జరుగనున్న మెగా ఈవెంట్‌కు పూర్తి ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నీతి ఆయోగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.