జగ్గూభాయ్ రెడీగానే ఉన్నాడు…

Jagapathi Babu Bollywood entry

టాలీవుడ్ నటుడు జగపతిబాబు త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విలన్, కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో దక్షిణాది భాషల్లో దూసుకెళ్తున్న జగపతిబాబు నటించిన దక్షిణాది సినిమాలు కొన్ని హిందీలోకి అనువాదం కాగా, ఇప్పుడు డైరెక్టు బాలీవుడ్ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ జగ్గూభాయ్‌.

  Jagapathi Babu Bollywood entry

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ అని తెలిపారు. అయితే ఎవరి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నదీ ఆయన చెప్పలేదు. బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని, ఒక సినిమాకు ఓకే చెప్పాను అని, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను చెబుతాను అని జగపతి చెప్పాడు.

కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కెరీర్ ను ఆస్వాధిస్తున్నాను అని జగపతి అన్నారు. యువహీరోలతో చేస్తున్నానా, సీనియర్ హీరోలతో చేస్తున్నానా అనే విషయాన్ని పెద్దగా ఆలోచించనని చెప్పారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక పాత్రను చేస్తున్నట్టుగా జగపతి చెప్పారు. ఆ పాత్ర ఎంతగానో నచ్చిందని వివరించారు.

  Jagapathi Babu Bollywood entry

ఈ మధ్యనే తను హీరోగా చేసిన ‘పటేల్ సార్’ సినిమా ఫెయిల్యూర్ పై కూడా జగపతిబాబు స్పందించారు. ఆ సినిమా పోవడం నిరాశ పరిచిందన్నాడు. సినిమా ట్రైలర్ చూసి హారర్ జోనర్ సినిమా అని ప్రేక్షకులు అనుకున్నారని, తీరా థియేటర్లో కుటుంబకథా చిత్రం చూసే సరికి వారు విస్తుపోయారన్నాడు.

వాళ్లు బిరియానీ కోసం వస్తే.. తాము భోజనం పెట్టి నిరాశ పరిచామని జగపతి చమత్కరించారు. మొత్తానికి జగపతిబాబు బాలీవుడ్‌ ఎంట్రీ ఎలా ఉండబోతోందో చూడాలంటే కొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే మరి.