వెన్నుపోటు పొడుస్తాడట !

Jagapathi Babu Bollywood entry

తెలుగు సినీ ఇండస్ట్రీ లో జగపతి బాబుకి ప్రత్యేక స్థానం ఉంది, అలనాటి హీరో శోభన్ బాబు తరువాత అంత రేంజ్ లో లేడీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న నటుడు ఆయన.నాటి తరం నటీనటుల్లో ఇప్పుడు బిజీ గా ఉన్నవారిలో జగపతి బాబు ముందు వరుస లో ఉన్నారు. లెజెండ్ సినిమా తో విలన్ గా మారిన ఆయన తరువాతి కాలంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కూడా ఆయనకి అదేవిధమైన పాత్రలు వెల్లువెత్తడంతో దేనికీ కాదనకుండా ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ క్యారెక్టర్ ఆరిస్ట్ గా సెటిల్ అయ్యాడు. ఇలా వస్తున్న పాత్రలని కాదనకుండా చేసుకుపోతున్నాడు జగపతిబాబు.

Jagapthi-Babu

అయితే.. ఇంత సుదీర్ధమైన కెరీర్ లో మెగా హీరోలతో నటించలేదనే కోరిక మాత్రం చాలా కాలంగా ఈ హీరో కం విలన్ ను వెంటాడుతోందట. తేజు కెరీర్ ప్రారంభంలో అతడితో కలిసి నటించినా.. మెగా హీరోల్లో స్టార్స్ తో నటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగపతి బాబు డ్రీమ్ నెరవేరబోతోంది. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రంగస్థలం మూవీలో నటిస్తున్న జగపతిబాబు.. ఇప్పుడు మరో అపురూపమైన అవకాశం కూడా దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న మెగస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా జగపతి నటిస్తున్నాడు.

ఉయ్యాల వాడ నరసింహా రెడ్డితో నమ్మకంగా వుంటూనే, వెన్నుపోటు పొడిచి, బ్రిటిష్ వాళ్లకు ఆచూకీ తెలియచేసే పాత్ర జగపతి బాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బాగా ఫెమిలియర్ కావడం అన్నది జగపతిబాబుకు కలసి వచ్చింది. మొత్తానికి మెగా హీరోలతొ నటించాలన్న కోరిక జగపతి బాబుకు ఇలా తీరుతోంది.