సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘జై లవ కుశ’..

Jai Lava Kusa gets UA certificate

ఎన్టీఆర్ .. బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జై లవ కుశ’ .. ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ స్వయంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లకు .. ట్రైలర్ కు .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్ తో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసాన్ని చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమాకి ప్రత్యేక స్థానం దక్కుతుందని అంటున్నారు.

Jai Lava Kusa gets UA certificate

ఈ సినిమాకి సంబంధించిన నైజామ్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన 20 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఇక వైజాగ్ హక్కులను కూడా 8 కోట్లకు ఆయనే సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమాపై ఆయన 28 కోట్ల వరకూ పెట్టేశారు. ఈ నెల 21వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా, ఈ రెండు ప్రాంతాల్లో దిల్ రాజుకి ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రాశి ఖన్నా,నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు.